{ "require": { "dompdf/dompdf": "^2.0" } } నాగ చైతన్య ‘NC24’లో మీనాక్షి చౌదరి పాత్ర ఏమిటి.. – themes.vedasoftware.in
Home » Cinema » నాగ చైతన్య ‘NC24’లో మీనాక్షి చౌదరి పాత్ర ఏమిటి..

నాగ చైతన్య ‘NC24’లో మీనాక్షి చౌదరి పాత్ర ఏమిటి..

Test Ad (300x250)

📰 Generate e-Paper Clip

నాగ చైతన్య ‘NC24’లో మీనాక్షి చౌదరి పాత్ర ఏమిటి.

హైదరాబాద్‌, నవంబర్‌ 2 : టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా సినిమా ‘NC24’. ఈ చిత్రాన్ని ‘విరూపాక్ష’ ఖ్యాతి గల దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. మైథలాజికల్ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా మూవీ మేకర్స్‌ ఒక ఆసక్తికర పోస్టర్‌ను షేర్ చేశారు. “ప్రతీ యాత్ర ఒక రహస్యంతో ప్రారంభమవుతుంది” అంటూ క్యాప్షన్‌ ఇచ్చి, డార్క్‌ షేడ్స్‌లో మీనాక్షి చౌదరి బ్యాక్ లుక్‌ను విడుదల చేశారు. రేపు ఉదయం 10:08 గంటలకు ఆమె పాత్ర వివరాలను వెల్లడించనున్నట్లు ప్రకటించారు. ఈ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మీనాక్షి ఏ పాత్రలో కనిపించబోతోందన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో పెరుగుతోంది.

ఇక మరోవైపు, ‘లాపతా లేడీస్‌’ ఫేమ్‌ నటుడు స్పర్శ్‌ శ్రీవాత్సవ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. లాపతా లేడీస్‌ చిత్రంలో దీపక్‌ కుమార్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ రాజస్థానీ యాక్టర్‌, ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు.

ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సంగీతం కాంతార‌ ఫేమ్‌ అజనీశ్‌ లోక్‌నాథ్‌ అందిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌పై చైతన్య అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మైథలాజికల్ థ్రిల్లర్‌తో అక్కినేని హీరో మరోసారి సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లైవ్ టీవీ